ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన జై భారత్ నేషనల్ పార్టీ

Jai Bharat National Party Announced Election Manifesto, Mango News ,Mango News Telugu,JD Lakshminarayana Released Jai Bharat Party Manifesto,Jai Bharat National Party Manifesto,AP Elections 2024,Jai Bharat Party Manifesto released by VV Lakshminarayana,JD Laxminarayana Release Jai Bharat National Party Manifesto,Jai Bharat National Party,Jai Bharat National Party News,Jai Bharat National Party Latest News Jai Bharat National Party Announced Election Manifesto

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఎన్నికలపై ఫోకస్ పెట్టి దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో బరిలోకి దిగుతామని లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైన లక్ష్మీనారాయణ.. తాజాగా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అమలు చేసే పథకాలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు.

తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తామని.. ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రైతులకు చేయూత కింద ప్రతి సంవత్సరం రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఖరీఫ్ సీజన్‌కు రూ. 5 వేలు.. రబీ సీజన్‌కు రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతులకు మద్దతు ధర అందిస్తామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ.. ప్రతి పంచాయితీలో 10 చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

అలాగే ప్రతి ఏడాది నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జేడీ లక్ష్మీనారాయణ వివరించారు. జనవరి 26న గ్రూప్-1 నోటిఫికేషన్.. ఆగష్టు 15న గ్రూప్-2 నోటిఫికేషన్.. సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్.. అక్టోబర్ 31న ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల జీవిత భీమా కల్పిస్తామన్నారు. అలాగే పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి ఉచితంగా ఇసుక, కంకరలు అందిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతామని ప్రకటించారు.

అలాగే రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి 50 ఎకరాల డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని.. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తామని వివరించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులు, గర్బిణీలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా కర్నూలు, విశాఖపట్టణాలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని జేడీ లక్ష్మీనారాయణ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − one =