రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

10th class breaking news today, 10th exams in ap 2021 latest news, Andhra Pradesh to conduct 10 and Intermediate exams, ap 10th class exam time table 2021, ap 10th class exams 2021 updates, AP BJP President, AP BJP President Somu Veerraju, AP BJP President Somu Veerraju Appeals CM YS Jagan, AP BJP President Somu Veerraju Appeals CM YS Jagan to Postpone 10th and Inter Exams, AP To Conduct Class X And XI Exams Amid COVID-19, Mango News, Postpone 10th and Inter Exams, Somu Veerraju

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించటం వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని, తక్షణమే ఆ పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.

“పెరుగుతున్న కోవిడ్ ఉదృతి దృష్ట్యా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. కోవిడ్ ను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలను రద్దుచేసి వారిని తర్వాత తరగతులకు ప్రమోట్ చేసింది. పది, ఇంటర్ పరీక్షలను మాత్రం ప్రకటించిన షెడ్యూల్ లోనే నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ లో పరీక్షలు నిర్వహించడం సమస్యగా పరిణమిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాలు కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడతాయి. అందువల్ల విద్యార్థుల భద్రత, రక్షణ దృష్ట్యా పరీక్షలను వాయిదావేయాలి” అని పేర్కొన్నారు.

“కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సా విధానాలు, ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కోవిడ్ వ్యాధి ప్రాణాంతకం కావడంతో ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ చర్యలతో కొందరు అప్పులపాలైపోతున్నారు. కొందరు లక్షలు ఖర్చుచేసినా ప్రాణాలు నిలుపుకోలేకపోతన్నారు. రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే వారికి తక్కువ ఫీజులతో వైద్య సౌకర్యం కూడా అందించడమే ప్రభుత్వ విధే. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స, విధించే ఛార్జీలపై సంబంధిత అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తూ చర్చలు నిర్వహిస్తూ, ఒక విధి విధానాన్ని రూపొందించాలి. కోవిడ్ వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైన రోగులందరికీ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల పలువురు మరణిస్తున్న సంఘటనలు మనల్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇలాంటి బాధాకరమైన సంఘటనలను మరల జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందువల్ల కోవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులు, ఇంజక్షన్లు ఎప్పుడూ స్టాకులో ఉంచుకోవాలి. ఇవి నల్లబజారులో అమ్మకుండా అసలైన ధరకు అందుబాటులో ఉంచేలా పర్యవేక్షించాలి. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలి” అని సోము వీర్రాజు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =