పెమ్మసాని ప్రత్యర్థి తేలిపోయాడా..

Guntur, Pemmasani chandrashekar, kilari rosaiah, AP elections, tdp,Lok Sabha constituency,YSRCP,Kilari Rosaiah,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,andhra pradesh,Mango News Telugu,Mango News
Guntur, Pemmasani chandrashekar, kilari rosaiah, AP elections, tdp,Lok Sabha constituency,YSRCP,Kilari Rosaiah,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,andhra pradesh,Mango News Telugu,Mango News

పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు గుంటూరులో ఆయనో సంచలనం.. జంకూ, బొంకూ లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్న అధినాయకుడు. ప్రజాసేవే ధ్యేయంగా అడుగులేస్తున్న ప్రజానాయకుడు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చి తక్కువకాలమే అయినప్పటికీ.. అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న దమ్మున్న లీడర్. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ దూకుడు చూసి.. వైసీపీ హడలిపోతోంది. కుదేలుమంటోంది. ఎంతలా అంటే ఏకంగా చంద్రశేఖర్ దెబ్బకు వైసీపీ అభ్యర్థినే మార్చేసింది. ఉమ్మారెడ్డి వెంకట రమణను తప్పించి.. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యను గుంటూరు పార్లమెంట్ స్థానం ఇంఛార్జ్‌గా నియమించింది.

గుంటూరు ప్రజలను వైసీపీ పట్టించుకోకపోయినప్పటికీ.. పెమ్మసాని ఫ్యామిలీ ఆ ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ వస్తోంది. గత ఇరవై ఏళ్లుగా పెమ్మసాని చంద్రశేఖర్ తన సొంత నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు. గుంటూరు ప్రజానీకమంతా కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌కే జై కొడుతోంది. ఆయన వెంటే నడుస్తోంది.

రోజురోజుకు గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజాబలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వైసీపీ మాత్రం అక్కడ వీక్ అయిపోతోంది. దీంతో గుంటూరులో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఇన్నిరోజులు చంద్రశేఖర్‌ను అడ్డుకునేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు, కుతంత్రాలు చేసిన వైసీపీ .. ఇప్పుడు తమ అభ్యర్ధిని మర్చేసింది. గతంలో గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉమ్మారెడ్డి వెంకటరమణ రెడ్డిని వైసీపీ నియమించింది. కానీ చంద్రశేఖర్‌ను ఆయన ఎదుర్కోలేరని భావించిన వైసీపీ.. ఉమ్మారెడ్డిని సైడ్ చేసి కిలారి రోశయ్యను ఇంఛార్జ్‌గా నియమించింది.

కిలారి రోశయ్య గత ఎన్నికల్లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఈసారి గుంటూరు నుంచి వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కానీ గుంటూరులో వైసీపీ పూర్తిగా వీక్ అయిపోయింది. ప్రజలంతా వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ వెంటే నడుస్తున్నారు. కిలారి రోశయ్యకు కూడా ఆ నియోజకవర్గంలో పెద్దగా బలం లేదు. ఈసారి ఆయనకు గుంటూరులో కష్టమేనని చెప్పాలి. గుంటూరులో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చంద్రశేఖర్‌ను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ.. అక్కడి ప్రజానీకం మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్ వెంటే అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 4 =