చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా..? బీజేపీతో పొత్తు కుదురుతుందా..?

Will Chandrababus Efforts Bear Fruit Will There be an Alliance with BJP,Will Chandrababus Efforts Bear Fruit,There be an Alliance with BJP,Chandrababu Naidu, Chandrababu Delhi Tour, BJP, AP Assembly elections,Mango News,Mango News Telugu,BJP dilemma in Andhra Pradesh,BJP said on possibility of alliance,BJP ahead of INDIA alliance,No alliance with BJD,Alliance with BJP Latest News,Alliance with BJP Latest Updates,Chandrababu Latest News,Chandrababu Live Updates
Chandrababu Naidu, Chandrababu Delhi Tour, BJP, AP Assembly elections

ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తెరిచివున్న అన్ని దారుల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం పార్టీ.. అటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు గురించి బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు.  అటు ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. ఏపీలో కూడా పొత్తు కోసం ప్రయత్నాలు చూస్తోంది.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. జనవరి రెండో వారంలో ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే పొత్తు గురించి బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరిపేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు గురించి బీజేపీ అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చుకొనే రానున్నారట. ఈక్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది. తెలుగు దేశం పార్టీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకుంటుందా..? లేదా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈసారి ఎన్నికల్లో కలిసొస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వైసీపీని ఢీ కొట్టడం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మరింత ఈజీ అవుతుందని అనుకుంటున్నారు. అటు కేంద్రంలో కూడా మూడోసారి కాషాయపు జెండా ఎగరడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావాలంటే బీజేపీకి కొన్ని స్థానాలు కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

పొత్తు గురించి ఏదో ఒకటి క్లారిటీ వస్తే.. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీతో పొత్తు కుదిరితే 2014 సీన్ కచ్చితంగా రిపీట్ అవుతుందని అనుకుంటున్నారట. అందుకే ఎన్నికల ముంగిట ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పొత్తు గురించి ఏదో ఒకటి తేల్చుకోనున్నారట.

మరో వైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా ప్రధాని మోడీకి దగ్గరగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి జగన్.. ప్రధాని మోడీతో సమావేశమవుతుంటారు. ఈ పరిస్థితుల మధ్య బీజేపీ.. తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా.. అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =