కరోనా వ్యాప్తి : తమిళనాడు రాష్ట్రంలో ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్ విధింపు!

Chennai News, Mango News, night curfew from 6 Jan, Spike in Covid-19 cases, Tamil Nadu Announces Complete Lockdown, Tamil Nadu announces full lockdown on Sunday, Tamil Nadu announces full lockdown on Sundays, Tamil Nadu Govt, Tamil Nadu Govt to Impose Full Lockdown on Sundays, Tamil Nadu Govt to Impose Full Lockdown on Sundays due to Rising COVID-19 Cases, Tamil Nadu imposes complete lockdown on Sundays, Tamil Nadu imposes full lockdown on Sundays as Covid cases spike, Tamil Nadu might impose full lockdown on Sundays

దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఆదివారాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ప్రకటించారు. అలాగే తమిళనాడులో రేపటి నుండి (జనవరి 6) రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.

ఇంకా మరిన్ని ఆంక్షలు అమలు చేస్తామని, వీటిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని మంత్రి తెలిపారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు 27,55,587 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27,06,370 మంది కరోనా నుంచి కోలుకోగా, 36,805 మంది మరణించారు. ప్రస్తుతం 12,412 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =