కరోనా వ్యాప్తి: మూడు రోజులు పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌

Goa Coronavirus Lockdown, Goa Lockdown, Goa Lockdown News, Goa Lockdown Updates, Three-day lockdown in Goa, Three-day Strict Lockdown Imposed in Goa

కరోనా వ్యాప్తి ప్రభావంతో పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవా రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా గోవా ప్రభుత్వం జూలై 17 నుండి జూలై 19 వరకు మూడు రోజుల పాటు కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. తీరప్రాంతాలతో సహా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజలెవరూ తిరగకుండా నిషేధం విధించారు. అలాగే రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రకటించిన ‘జనతా కర్ఫ్యూ’ ఆగస్టు 10 వ తేదీ వరకు కొనసాగుతుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. మరో వైపు గోవాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3108 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 1817 మంది డిశ్చార్జ్ అవ్వగా, 19 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + five =