పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరంలా శరవేగంగా పూర్తి చేయాలి

CM KCR Latest News, CM KCR Review On Mahabubnagar District, CM KCR Review On Mahabubnagar District Irrigation Projects, Irrigation Projects, Irrigation Projects In Telangana, KCR Review On Mahabubnagar District Irrigation Projects, Mahabubnagar District, Mahabubnagar District Irrigation, Mango News Telugu, Telangana Latest News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్నదని చెప్పారు. మిగిలిన సగానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారానే నీరివ్వాలని, కాళేశ్వరం తరహాలోనే మూడు షిప్టులు పనిచేసి పనులు త్వరగా పూర్తీ చేయాలనీ అధికారులను కోరారు.

పాలమూరు ప్రాజెక్టు లో భాగంగా, ప్రస్తుతం జరుగుతున్న పనులపై భవిష్యత్తులో జరగాల్సిన పనులపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌజులు, కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని కోరారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటన జరిపి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల ఈఎన్‌సీ మురళీధరరావు, సీఈ రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=CUU4zZvH548]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =