కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి యూట‌ర్న్!

Komatireddy Rajagopal Reddy Uturn,Komatireddy Rajagopal,Rajagopal Reddy Uturn,Komatireddy Uturn,Mango News,Mango News Telugu,komatireddy rajagopal reddy, congress, bjp, telangana assembly elections,Komatireddy Latest News,Komatireddy Latest Updates,Rajagopal Reddy Latest News,Rajagopal Reddy Latest Updates,telangana assembly elections Latest News,telangana assembly elections Latest Updates,telangana assembly elections Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
komatireddy rajagopal reddy, congress, bjp, telangana assembly elections,

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయోమ‌యంలో ప‌డ్డారు. కాంగ్రెస్ క‌న్నా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంద‌న్న తొంద‌ర‌లో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన పార్టీని వ‌దిలేశారు. క‌మ‌లం గూటికి చేరారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ ఆయ‌న బీజేపీలో చేరారు. మునుగోడు బైపోల్‌ ఎన్నికలో పోటీ చేసి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత బీజేపీకి దూరంగా వస్తున్న ఆయన.. కొంతకాలం నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తాజాగా బీజేపీ రిలీజ్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌లో తన పేరు ప్రకటించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత  2016 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా కొన‌సాగారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా.. రాజ‌గోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొన‌సాగుతూ వ‌చ్చారు. ఇప్పుడు తాజాగా ఆయ‌న కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పెద్దలతో ఒప్పందం సైతం కుదిరింది.

అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండాలని రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఆయన బుధవారం నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. పార్టీ మార్పునకు సంబంధించిన అంశం, అందుకు దారితీసిన కారణాలను ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అనంతరం నేడు లేదా రేపు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దల సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.

ఆయనతోపాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? లేక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలా? అనే అంశంపై డైలమాలో ఉన్నానని, మునుగోడు నుంచి తన భార్యను పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నానని బీజేపీ అధిష్ఠానానికి రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ విషయమై ఆయననే ఆలోచించుకోవాలంటూ అధిష్ఠానం కొద్దిరోజులు అవకాశం ఇచ్చిందని, అందుకే మొదటి జాబితాలో ఆయన పేరు లేదని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలలో ఆలస్యం జరగడానికి కూడా రాజగోపాల్‌రెడ్డి చేరికే కారణమని సమాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా మ‌ళ్లా రాణిస్తారా లేదా వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =