మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మహీంద్రా గ్రూప్ ఒప్పందం, రూ.1,000 కోట్లతో ఈవీ ప్లాంట్‌.. పాల్గొన్న సినీ నటుడు రామ్‌చరణ్‌

Mahindra Group Signs Mou To Set up EV Plant Worth Rs 1000 Cr in The Presence of Minister KTR Actor Ram Charan Attends,Mahindra Group Signs Mou,To Set up EV Plant Worth Rs 1000 Cr,Presence of Minister KTR, Actor Ram Charan Attends,Mango News,Mango News Telugu,Mahindra Electric Car Xuv300,Mahindra E2O Plus,Mahindra Electric Bangalore,Mahindra Ev 400,Mahindra Electric Auto,Mahindra Electric Commercial Vehicle,Mahindra Ev Price,Mahindra E2O Price,Mahindra Electric Car 2022,Mahindra Electric Mobility Limited,Mahindra Born Electric,Mahindra Group Ev,Mahindra Fastest Electric Car,Mahindra Group Overview,Mahindra Electric Car Range,Mahindra Group Companies,Mahindra Electric Car List,Eventus Solutions Group Tech Mahindra,Mahindra Group Core Values,Mahindra Group Share List,Mahindra Group Careers,Mahindra Group Owner

దేశీయ ఆటో రంగంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబోతోంది. దీనిలో భాగంగా మహీంద్రా గ్రూప్ జిల్లాలోని జహీరాబాద్‌లో ప్రస్తుత తయారీ కేంద్రం వద్ద రూ.1,000 కోట్లు భారీ పెట్టుబడితో ఈవీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. ‘ఇప్పటికే ట్రాక్టర్‌లను తయారు చేస్తున్న ప్లాంట్‌లో విస్తరణ ప్రాజెక్ట్‌గా లాస్ట్ మైల్ మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది’ అని వాహన తయారీ సంస్థ మహీంద్రా గ్రూప్‌ ఈడీ రాజేశ్‌ జెజూరికర్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా ఇక్కడ కంపెనీ ఇప్పటికే 2013 నుండి ట్రాక్టర్‌లను తయారు చేస్తోంది. దీనిద్వారా జహీరాబాద్‌లో అదనంగా 800-1,000 ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన ప్రకటించారు.

గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని టెక్‌మహీంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్‌లో జరిగిన ‘ఎక్స్‌యూవీ-400’ ఫార్ములా ఎడిషన్‌ జనరేషన్‌-3 రేసింగ్‌ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మరియు టాలీవుడ్ ప్రముఖ నటుడు సినీ నటుడు రామ్‌చరణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టెక్‌ మహీంద్రా ప్రతినిధులు సీపీ గుర్నానీ, వీంతా నయ్యర్‌ తదితరులు ఎంఓయుపై సంతకం చేశారు. కాగా ఈ ప్రతిపాదిత విస్తరణ కోసం అంచనా వేయబడిన పెట్టుబడి కంపెనీ లేదా దాని గ్రూప్ కంపెనీల ద్వారా ఎనిమిదేళ్ల వ్యవధిలో సుమారుగా రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. ప్రతిపాదిత పెట్టుబడి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది తెలంగాణ ప్రభుత్వ ఈవీ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ కింద మెగా ప్రాజెక్టుల కేటగిరీ కిందకు వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తరువాత జరిగిన చర్చల్లో భాగంగానే మహీంద్రా గ్రూప్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కూడా స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =