టి.బీజేపీలో భారీ ప్రక్షాళన

Massive Purge in Telangana BJP, Purge in Telangana BJP, Telangana BJP, Kishan Reddy, BJP District Presidents Change, Lok Sabha Elections, Latest BJP News, Telanagana BJP News, Kishan Reddy Incharge, Lok Sabha Elections, Parliament Elections News, TS CM Revanth Reddy, Poltical News, Mango News, Mango News Telugu
Telangana BJP, Kishan Reddy, BJP District presidents change, Lok sabha elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా చాటాలని ప్రయత్నించిన బీజేపీకి నిరాశే ఎదురయింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజ నేతలు ఈసారి ఓటమిని చవిచూశారు. అయితే ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడమే ఓటమికి కారణమని వాదనలు వినిపించాయి. అలాగే జిల్లాల స్థాయిలో అధ్యక్షులు, నేతలు ఎన్నికలవేళ సరిగా పనిచేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఇక త్వరలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈక్రమంలో తెలంగాణ బీజేపీ భారీ ప్రక్షాళన చేపట్టింది. పెద్ద ఎత్తున అధ్యక్షులను మార్చేసింది.

తెలంగాణ రాష్ట్ర మోర్చాలతో పాటు 12 మంది జిల్లాల అధ్యక్షులను ఛేంజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించలేదని ఆరోపణలు వచ్చినవారితో పాటు, సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. నిజామాబాద్ బీజేపీ ఇంఛార్జ్‌గా కులాచారి దినేష్ కుమార్‌ను.. పెద్దపల్లి బీజేపీ ఇంఛార్జ్‌గా చందుపట్ల సునీల్‌ను.. సిద్ధిపేట బీజేపీ ఇంఛార్జ్‌గా గంగడి మోహన్ రెడ్డిని.. భువనగిరి బీజేపీ ఇంఛార్జ్‌గా పాశం భాస్కర్‌ను.. సంగారెడ్డి బీజేపీ ఇంఛార్జ్‌గా గోదావరిలను నియమించారు.

అలాగే ములుగు బీజేపీ ఇంఛార్జ్‌గా బలరాంను.. నల్లగొండ బీజేపీ ఇంఛార్జ్‌గా డా.వర్షిత్ రెడ్డిని.. వరంగల్ బీజేపీ ఇంఛార్జ్‌గా గంటా రవికుమార్‌ను.. మహబూబ్‌నగర్ బీజేపీ ఇంఛార్జ్‌గా శ్రీనివాస్ రెడ్డిని..వనపర్తి బీజేపీ ఇంఛార్జ్‌గా నారాయణను.. నారాయపేట్ బీజేపీ ఇంఛార్జ్‌గా జలంధర్ రెడ్డిని.. వికారాబాద్ బీజేపీ ఇంఛార్జ్‌గా మాధవ్ రెడ్డిలను నియమించారు. వీరితో పాటు మహబూబాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల ఇంఛార్జ్‌లను కూడా త్వరలో మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇకపోతే బీజేపీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్‌.. ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్.. ఓబీసీ మొర్చా అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్.. మహిళా మొర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప.. యువ మొర్చా అధ్యక్షుడిగా సేవెల్ల మహేందర్ రెడ్డిలను నియమించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 4 =