స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు: రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…

Swatantra Bharatha Vajrotsava Dwisapthaham CM KCR Decides Day-to-day Programs Schedule, CM KCR Decides Day-to-day Programs Schedule Of Swatantra Bharatha Vajrotsava Dwisapthaham, Telangana CM KCR To Organise Azaadi Ka Amrit Mahotsav Day-to-day Programs Schedule, CM KCR To Organise Azaadi Ka Amrit Mahotsav Day-to-day Programs Schedule, KCR To Organise Azaadi Ka Amrit Mahotsav Day-to-day Programs Schedule, CM KCR Decides Day-to-day Programs Schedule, Swatantra Bharatha Vajrotsava Dwisapthaham, Azaadi Ka Amrit Mahotsav, Swatantra Bharata Vajrotsava Dwisaptaham from August 8 to 22, 75th India Independence Day celebrations, Independence Day celebrations, Telangana CM KCR, CM KCR, Swatantra Bharata Vajrotsava Dwisaptaham News, Swatantra Bharata Vajrotsava Dwisaptaham Latest News, Swatantra Bharata Vajrotsava Dwisaptaham Latest Updates, Swatantra Bharata Vajrotsava Dwisaptaham Live Updates, Mango News, Mango News Telugu,

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో నిర్వహించే రోజు వారీ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం: రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్

  • ఆగస్టు 08: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలు
  • ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
  • ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
  • ఆగస్టు 11: ఫ్రీడం రన్ నిర్వహణ
  • ఆగస్టు 12: రాఖీ పండుగ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
  • ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
  • ఆగస్టు 14: సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
  • ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • ఆగస్టు 16: ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
  • ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ
  • ఆగస్టు 18: ‘ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
  • ఆగస్టు 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ
  • ఆగస్టు 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
  • ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
  • ఆగస్టు 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =