పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా టీ-కాంగ్రెస్‌ నాయకులు నిరసన

Congress leaders hold protest against fuel price hike, fuel price hike, Mango News, Petrol diesel cost, protest against fuel price hike, Protest hike in fuel prices today, telangana, Telangana Congress Leaders Participated in a Protest, Telangana Congress Leaders Participated in a Protest Against Petrol, Telangana Congress Leaders Participated in a Protest Against Petrol Diesel Price Hike, Telangana Congress stir against high fuel prices, TPCC holds protest against hike in petrol

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి పెట్రోల్‌ బంకుల వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. హైదరాబాద్‌ లోని సెక్రటేరియట్ పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ఒక సంవత్సరంలో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని విమర్శించారు. ప్రజలపై భారం వేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పాత్ర పోషిస్తుందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం ధరలు భారీగా పెంచారని, అసలు ధరకంటే ప్రజలు టాక్సులు ఎక్కువ కడుతున్నారని చెప్పారు. చుట్టుపక్కల దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.50 కంటే తక్కువుగా ఉన్నాయని, దేశంలో రూ.100 దాటిందని అన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలపై భారం తగ్గించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 17 =