తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల

Telangana Inter 2nd Year-2021 Results Declared, inter results, Inter Results In Telangana, Intermediate Results In Telangana, Intermediate Results Released, Intermediate second year 2021 results, Telangana Inter Results, Telangana Intermediate Results, Telangana Intermediate Results 2021, Telangana Intermediate Results 2021 Release, Telangana Intermediate Results 2021 Releasek, TS Inter Results 2021

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఉత్తీర్ణులైన 4,51,585 మంది విద్యార్థి/విద్యార్థిని లలో 1,76,719 మంది ఏ గ్రేడ్‌, 1,04,888 మంది బీ గ్రేడ్‌, 61,887 మంది సీ గ్రేడ్‌, 1,08,093 మంది డీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయినట్టు తెలిపారు. ఈ ఫలితాలు www.tsbie.cgg.gov.in మరియు http.//results.cgg.gov.in వెబ్ సైట్ లలో అందుబాటులో ఉండనున్నాయి.

ముందుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవలే ఖరారు చేశారు. సబ్జెక్ట్స్ లో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే, ద్వితీయ సంవత్సరంకు కూడా కేటాయించాలని నిర్ణయించారు. ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు పూర్తి మార్కులను కేటాయించ‌నున్నట్టు తెలిపారు. గతంలో ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు 35 శాతం మార్కులు, అలాగే బ్యాక్‌లాగ్స్ ఉన్నవారికి ఆ స‌బ్జెక్టుల‌కు ద్వితీయ సంవత్సరంలో కూడా 35 శాతం మార్కులతో, అలాగే ప్రైవేటుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులను 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాల మేరకు ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =