ఈ నెల 12 నుంచి తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

Telangana Inter Advanced Supplementary Exams to be Started From June 12,Telangana Inter Advanced Supplementary Exams,Inter Advanced Supplementary to be Started,Inter Supplementary From June 12,Mango News,Mango News Telugu,TS Inter Supplementary Exams 2023,TS Inter 1st Year & 2nd Year Supplementary,TS Inter Supplementary Exam Time Table,Inter Advanced Supplementary Exams,Inter Supplementary Exams 2023,TS Inter Supplementary Exams Dates,Telangana Inter Supplementary Exams Dates,Telangana Inter Supplementary Latest News,Telangana Inter Supplementary Latest Updates,Telangana Inter Supplementary Live News,Telangana Latest News And Update,Telangana Inter Exams Live Updates

తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు నేరుగా ఈ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ల‌తో ప‌రీక్షా కేంద్రాల‌కు వ‌స్తే, వారిని త‌ప్ప‌కుండా అనుమ‌తించాల‌ని ఇంటర్ బోర్డు అధికారులు అన్ని జిల్లాల చీఫ్ సూప‌రింటెండెంట్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక సంబంధిత కాలేజీల ప్రిన్సిప‌ల్స్ త‌మ లాగిన్ల ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థుల‌కు అంద‌జేయొచ్చని, అదేసమయంలో హాల్ టికెట్ల‌పై ఆయా కాలేజీల ప్రిన్సిప‌ల్స్ సంత‌కాలు త‌ప్ప‌నిస‌రి కాద‌ని కూడా అధికారులు స్ప‌ష్టం చేశారు. కాగా ఇంటర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వహించనున్నామని, అలాగే ఇంటర్ ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =