పవన్‌ అక్కడ నుంచి పోటీ చేస్తే..వాట్ నెక్స్ట్

If Pawan Contests From Pitapuram What Next, Pawan Contests From Pitapuram, YCP Focus on Pitapuram, Pitapuram, Pawan Contests, YS Jagan, Jana Sena, CM Jagan, TDP, Pawan Kalyan, Vanga Gita, Mudragada Padmanabham, Giribabu, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP focus on Pitapuram,Pitapuram, Pawan contests,YS Jagan,Jana Sena, CM Jagan, TDP, Pawan Kalyan, Vanga Gita,Mudragada Padmanabham, Giribabu

రాబోయే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నరకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి తప్ప అసలు తానెక్కడ నుంచి బరిలో దిగుతారనే విషయాన్ని పవన్  ప్రకటించలేదు.  కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో  ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు.

దీని గురించి మాట్లాడటానికి పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ వంగా గీతను అర్జంటుగా పిలిపించి మాట్లాడారు. దీని ప్రకారం కొద్ది రోజులుగా వార్తల్లో నానుతున్న ముద్రగడ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుని పిఠాపురం నుంచి బరిలోకి దింపడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వంగా గీతను కాకినాడ పార్లమెంట్ పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గం  కేటాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీపై ఇంకా క్లారిటీ రాకుండానే ఇటు వైసీపీ వర్గం వ్యూహాలు రచించడంతో పవన్ నిజంగానే అక్కడ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రచారం ఊపందుకుంది.  దానికి తగినట్లుగానే.. జనసేన నేతలు పిఠాపురంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తే ఏం చేయాలనేదానిపై వైసీపీ అధిష్టానం అలర్ట్‌ అయ్యింది.

ఒకవేళ పిఠాపురం నుంచి కనుక జనసేన అధినేత పవన్‌ పోటీ చేస్తే.. అక్కడ బలమైన ప్రత్యర్థిని పోటీలో దింపడానికి వైఎస్సార్సీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాస్త నెగివిటీ ఉన్న పిఠాపురం సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు ఇప్పటికే  పిఠాపురం కోఆర్డినేటర్‌గా అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం గీత పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు.

మరోవైపు తాజాగా ముద్రగడ పద్మనాభం పవన్‌కళ్యాణ్‌కు గురువారం బహిరంగ లేఖ  రాయడంతో..ఇక ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని స్పష్టమైంది.దీంతో  ముద్రగడ పద్మనాభాన్ని కానీ ఆయన కొడుకు ముద్రగడ  గిరిబాబును కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. పవన్‌కు చెక్ పెట్టడానికి కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ముద్రగడ కుటుంబ సభ్యులను అక్కడ నుంచి పోటీ చేయిస్తే ఫలితాలుంటాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ విషయంపైనే అర్జంటుగా వంగా గీతను తాడేపల్లి  పిలిపించి  మరీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =