పలు అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, Janasena Appoints Incharges For Assembly Constituencies, Janasena Appoints Incharges For Parliament, Janasena Party Latest News, Mango News Telugu, Pawan Kalyan Janasena

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నియామకాలు చేపట్టారు. వీరిలో ఎక్కువ శాతం మంది గత ఎన్నికల్లో పోటీ అభ్యర్థులే ఉండడం విశేషం. జనసేన తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను రాజోలు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అలాగే ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమించారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాతా పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది.

జనసేన పార్టీ ఇంచార్జులు:

విశాఖపట్నం జిల్లా:

  • విశాఖ పార్లమెంట్‌ ఇంచార్జ్: జేడీ వీవీ లక్ష్మీనారాయణ,
  • విశాఖపట్నం నార్త్ – పి.ఉషాకిరణ్
  • గాజువాక – కోన తాతారావు
  • భీమిలి – పంచకర్ల సందీప్
  • అనకాపల్లి అసెంబ్లీ – పరుచూరి భాస్కర రావు
  • ఎలమంచిలి – సుందరపు విజయకుమార్
  • చోడవరం – పి.వి.ఎస్.ఎన్.రాజు
  • అరకు పార్లమెంట్ ఇంచార్జి : పి.గంగులయ్య

తూర్పుగోదావరి జిల్లా:

  • కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి – పంతం నానాజీ
  • పిఠాపురం – మాకినీడు శేషుకుమారి
  • పెద్దాపురం – తుమ్మల రామస్వామి
  • కాకినాడ సిటీ – ముత్తా శశిధర్
  • జగ్గంపేట – పాటంశెట్టి సూర్యచంద్ర రావు
  • పత్తిపాడు – వరుపుల తమ్మయ్య బాబు
  • అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి – డి.ఎం.ఆర్. శేఖర్
  • అమలాపురం అసెంబ్లీ – శెట్టిబత్తుల రాజబాబు
  • ముమ్మిడివరం – పితాని బాలకృష్ణ
  • రామచంద్రపురం – పోలిశెట్టి చంద్రశేఖర్
  • రాజోలు – రాపాక వరప్రసాద్
  • పి.గన్నవరం – పాముల రాజేశ్వరి
  • కొత్తపేట – బండారు శ్రీనివాస్
  • మండపేట – వేగుళ్ల లీలాకృష్ణ
  • రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి – కందుల దుర్గేష్
  • అనపర్తి – మర్రెడ్డి శ్రీనివాస్
  • రాజమండ్రి సిటీ – అత్తి సత్యనారాయణ
  • రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్
  • రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్

గుంటూరు జిల్లా:

  • గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్
  • గుంటూరు వెస్ట్ – తోట చంద్రశేఖర్
  • గుంటూరు ఈస్ట్ – షేక్ జియాఉర్ రెహమాన్
  • రేపల్లె – కమతం సాంబశివ రావు
  • మంగళగిరి – చిల్లపల్లి శ్రీనివాస్
  • తెనాలి – నాదెండ్ల మనోహర్
  • సత్తెనపల్లి – వై.వెంకటేశ్వర రెడ్డి
  • నరసరావు పేట: సయ్యద్ జిలానీ

చిత్తూరు జిల్లా:

  • పీలేరు – బి దినేష్
  • మదనపల్లి – గంగారపు స్వాతి
  • శ్రీకాళహస్తి – వినుత నగరం
  • తిరుపతి – కె. కిరణ్ రాయల్
  • కుప్పం – డా. ఎం. వెంకటరమణ
  • గంగాధర నెల్లూరు – డా. పొన్న యుగంధర్

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =