టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు

Tirumala Tirupati Devasthanam, TTD Board, TTD Board Meeting, ttd board meeting news, ttd board meeting resolutions, ttd board meeting today, ttd board meeting updates, TTD Board Takes Several Key Decisions, TTD Board Takes Several Key Decisions Today

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆగస్టు 28, శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు:

  • శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం
  • సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహణ
  • అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి, అక్టోబర్‌లో ఉత్సవాల నాటికీ కరోనా ప్రభావం తగ్గితే గతంలో లాగానే ఉత్సవాల నిర్వహించే అవకాశం
  • కరోనా బారిన పడిన టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులు టీటీడీ భరించాలని పాలకమండలి నిర్ణయం
  • టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడి
  • బర్డ్‌ ఆసుపత్రిలో అదనపు గదుల నిర్మాణానికి రూ.5.5 కోట్లు కేటాయింపు
  • సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి ఆమోదం
  • టీటీడీలో ఎలక్రికల్ విభాగంలో పనిచేసే 53 కార్మికుల కాంట్రాక్టు మరో రెండు ఏళ్ళు పెంపు
  • గో సంరక్షణకు అధికప్రాధాన్యత, ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం
  • బ్యాంకుల్లో టీటీడీ బంగారు నగలు, నగదు డిపాజిట్ల విధానాలు మార్చాలని నిర్ణయం
  • ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి ఆమోదం
  • తిరుమలలో వ్యర్థాలను తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి రూ.కోటి విరాళం ఇచ్చినట్టు వెల్లడి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − three =