పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పుపై ఈసీ కీలక నిర్ణయం

EC Postpones Punjab Assembly Polls to February 20 After Request by CM and Other Political Parties,EC Postpones Punjab Assembly Polls to February 20, Punjab CM ,Punjab Political Parties,EC postpones Punjab polls to Feb 20 after request by CM,Election Commission postpones Punjab assembly election,EC Postpones Punjab Assembly Polls,Election Commission postpones polling day in Punjab ,Election Commission postpones polling day , Punjab ,Election Commission postpones polling day in Punjab ,Punjab Assembly Polls ,Punjab Assembly Elections,Punjab Elections,mango news,EC postpones Punjab Assembly polls

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో కీలక మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్ ఆరు రోజుల పాటు వాయిదా వేసింది. పాత తేదీ ఫిబ్రవరి 14 స్థానంలో కొత్తగా ఫిబ్రవరి 20న పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవల ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది.

అయితే, అదే సమయంలో ఫిబ్రవరి 16న యూపీ లోని బెనారస్ లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందే ప్రారంభమపుతాయి. పైగా రవిదాస్ జయంతి నేపధ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి తరలి వెళ్లనున్నారు. దీంతో వారంతా ఓటు వేసే అవకాశం కోల్పోతారని అన్ని పార్టీలు ఈసికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో.. పోలింగ్ తేదీని వారం పాటు వాయిదా వేయాలని స్వయంగా పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ కూడా ఈసీకి విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, చీఫ్ ఎలక్టోరల్ అధికారి నుంచి సమాచారం తీసుకుంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఎస్పీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ తేదీని ఫిబ్రవరి 20 కి మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =