43 ఏళ్ల తర్వాత.. జాతీయ నేతలు తెలంగాణలో పోటీ..?

After 43 Years National Leaders Contest In Telangana, 43 Years National Leaders Contest In Telangana, National Leaders Contest In Telangana, After 43 Years National Leaders, PM Modi, Lokh Sabha Elections, Indhira Gandhi, Sonia Gandhi, PM Modi Contest In Telangana, Modi Contest In Telangana, Latest National Leaders Contest In Telangana, Latest National Leaders Contest News, Parliament Electons, Political News, Telangana Political News, Telangana, Mango News, Mango News Telugu
PM Modi, Lokh sabha elections, Indhira gandhi, sonia gandhi

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటోంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఇప్పటి నుంచే దిగ్గజ పార్టీలు గెలుపుపై కన్నేసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. హ్యాట్రిక్ దిశగా ఇప్పటి నుంచే అడుగులేస్తోంది. అటు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఉత్తరాధి రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు ఉన్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల్లో సరైన పట్టులేదు. ఈక్రమంలో దక్షిణాదిలో పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అటు తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు.. అధినేత్రి సోనియా గాంధీని కోరారు. సోనియా గాంధీ కాకపోయినా ప్రియాంక గాంధీని అయినా తెలంగాణలో బరిలోకి దింపాలని.. గెలిపించుకొని తీరుతామని చెబుతున్నారు.

గతంలో ఇందిరాగాంధీ కూడా తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పారాజయం పాలయింది. తీవ్రంగా ఓడిపోయింది. ఆ తర్వాత  రెండేళ్లకే అంటే.. 1980లోనే తిరిగి మధ్యంతర ఎన్నికలకు వచ్చాయి. రెండేళ్లలోనే కాంగ్రెస్ తిరిగి పుంజుకుంది. ఆ సమయంలో ఇందిరా గాంధీ  తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.

ఆ సమయంలోనే తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో 7 వేల ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నానని.. మెదక్‌ ప్రజలు మాత్రం రెండు లక్షల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించారని ఇంధిరాగాంధీ వెల్లడించారు. ఇకపై రాయ్‌బరేలీ సీటు వదులుకొని మెదక్ ప్రజల తరుపునే లోక్‌సభలో అడుగుపెడుతానని ఇందిరా గాంధీ ఆసమయంలో ప్రకటించారు. ఇప్పుడు ఇందిరా గాంధీ తర్వాత.. దాదాపు 43 ఏళ్ల తర్వాత  జాతీయ అగ్రనాయకులు తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  మరి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీలో.. ఎవరు తెలంగాణ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =