వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు

Vande Bharat trains on those routes will start next week,Vande Bharat trains,Vande Bharat on those routes,Vande Bharat trains will start next week,Mango News,Mango News Telugu,Vande Bharat Express trains, Vijayawada to Chennai,Hyderabad to Bangalore, Modi will virtually launch 9 Vande Bharat Express trains, Kachiguda - Yeswantapur , Vijayawada to Chennai Vande Bharat trains,Vande Bharat trains Latest News,Vande Bharat trains Latest Updates,Vande Bharat trains Live News

విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ 9 వందేభారత్ రైళ్లలో.. కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంతపూర్(బెంగళూరు), విజయవాడ టూ చెన్నై వందేభారత్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభిస్తారని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి.. ప్రధాని నరేంద్ర మోడీ.. కాచిగూడ టూ యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 25 నుంచి కాచిగూడ టూ యశ్వంత్‌పూర్ రైలు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అయితే ఆరోజు కాచిగూడ స్టేషన్‌లో జరిగే వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాద్ , బెంగళూరు మధ్య దూరాన్ని 609 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేసేస్తుంది.

కాచిగూడ టూ యశ్వంత్‌పూర్ రైలు నెంబర్ 20703తో .. కాచిగూడలో ఉదయం గం.5.30 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ టూ కాచిగూడ రైలు నెంబర్ 20704తో.. యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం గం. 2:45 నిమిషాలకు బయలు దేరి.. రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ యశ్వంత్‌పూర్ టూ కాచిగూడ వందేభారత్ రైలుకు.. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌లలో స్టాప్‌లు ఉంటాయి.

అలాగే విజయవాడ టూ చెన్నై వందేభారత్ రైలును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 24న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగే వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, రాష్ట్ర మంత్రులుతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు పాల్గొంటారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు గురువారం తప్ప వారంలో మిగిలిన అన్ని రోజులు నడుస్తుంది. విజయవాడలో ఉదయం గం. 5.30 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి సాయంత్రం గం. 3.20 నిమిషాలకు బయలుదేరి..రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ టూ చెన్నై వందేభారత్ రైలుకు.. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో స్టాప్‌లు ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =